ఏ కోనలో కూలినాడో ఏ కొమ్మలో చేరినాడో
ఏ ఊరికో ఏ వాడకో యాడ బొయ్యాడో
రం రుధిరం సమరం శిశిరం
రం మరణం గెలవం ఎవరం
యాడ బోయినాడో యాడ బోయినాడో
సింత లేని లోకం సూడబోయినాడో
చారడేసి గరుడ పచ్చ కళ్ళు వాల్చి
గరిక పచ్చ నేల పైనే
సీమ కక్ష వేటువేస్తే రాలిపోయినాడో
రం రుధిరం సమరం శిశిరం
రం మరణం గెలవం ఎవరం
కట్టెలే సుట్టాలు కాడు మన తల్లి తండ్రి
అగ్గి దేవుడే మనకు ఆత్మాబందువుడంటా
కాలవ గట్టున నీకాళ్ళు కాలంగా
కాకీశోకమూ బోతిమే, కాకీశోకమూ బోతిమే
నరక స్వర్గ అవది దాటి వెన్న మాకులు దాటీ…
తిథియందు రారాని తదియందు రారాని
నట్టింట ఇస్తర్లు నాణ్యముగా పరిపించి
మీ వారు చింత పొయ్యేరు…
మీ వారు దుఃఖ పొయ్యేరు…
మృత్యువు మూకుడు మూసిన ఊళ్లకు
రెక్కలు తొడిగేదెవరని ఇంకని చెంపలపారే శోఖం
తూకం వేసేదెవరని
కత్తుల అంచున ఎండిన నెత్తురు కడిగే అత్తరు ఎక్కడని
ఊపిరాడని గుండెకుగాలిని కబళం ఇచ్చేదెవ్వరని
చుక్కేలేని నింగి ప్రశ్నించిందా వంగి
ఏ కొనల్లో కూలినాడో ఏ కొమ్మల్లో చేరినాడో
రం రుధిరం సమరం శిశిరం రం రుధిరం
రం మరణం గెలవం ఎవరం
హరోమ్ హరి నీ కుమారులిచ్చినా
భక్ష భోజనములు రాగి కానులు
ఇరం విడిచి పరము జేరిన
వారి పెద్దలకు పేరంటాలకు
మోక్షాది ఫలము కల్గు
శుభోజయము…
పద్నాలుగు తరాల వారికి
మోక్షాది ఫలము కలుగును
శుభోజయము…
శుభోజయము…